What your Nails Say About your Health-Health Tips in Telugu
గోళ్లు ఏమి చెబుతున్నాయి.
కళ్ళు, చేతుల గోళ్లు మన ఆరోగ్యం గురించిన ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. కాబట్టి గోళ్లు కత్తిరించుకునే ముందు నైల్ పాలిష్ వేసుకునే ముందు ఒకసారి గమనించవలసిన విషయాలు తెలుసుకుందాము.
- చేతి వేళ్ళ గోళ్ళ ఫై చివరన నల్లని గీత సన్నగా గీసినట్టు ఉంటె అది మీలో డయాబెటిస్, లివర్ సమస్యలు లేదా హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు చిహ్నంగా తెలుసుకోవచ్చు. అలాంటి గీత ఉంటె ఒకసారి పరీక్ష చేయించుకోవడం మంచిది.
- గోళ్లు తెల్లగా పాలిపోయి ఉంటే అది లివర్ సమస్యగా లేదా హైపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్లకు గురుతు కావచ్చు.
- చేతివేళ్ల గోళ్లు ఉబ్బినట్లుగా పైకి తేలి ఉంటే అది ఊపిరి తిత్తుల్లో సమస్య ఉన్నట్లుగా గుర్తించవచ్చు.
- గోళ్లు లేత పసుపు రంగులో పాలిపోయినట్లు ఉంటే శరీరంలో ఏదైనా ఫంగస్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్ లేదా ఊపిరి తిత్తులో సమస్యకు మాదిరి కావచ్చు.
- గోళ్ళ చివరలు వంకరలు తిరిగి స్పూన్ మాదిరిగా మారిపోతే అది లివర్లో సమస్య లేదా హైపో థైరాయిడిజం వల్ల కావచ్చు.
- గోళ్లు పొరలుగా విడిపోతూ బలహీనంగా ఉంటే అది ఎల్లపుడు నైల్ పాలిష్ లు వేసి ఉండడం వాల్ల ఇలా గోళ్లు బలహీన పడి పోతాయి.