You Know : What is the Origin of the Laughing Buddha-Telugu
లాఫింగ్ బుద్ధ ఎందుకు…
లాఫింగ్ బుద్ధ దేశ దేశాల్లో అదృష్టాన్ని తెచ్చే బొమ్మగా బోలెడంత గుర్తింపు ఉంది. ఇంతకీ ఎవరితడు ? చైనా కథ ప్రకారం ఇతడి అసలు పేరు హోటై . షుమారు వెయ్యేళ్ళ క్రితం నివసించిన బౌద్ధ భిక్షువు. భుజాన జోలె, చేతిలో భిక్షా పాత్రతో తిరుగుతుండే ఇతడికి ఎన్ని మహిమలో… తెలియని వారికీ ఒత్తి భైక్షగాడిగా మాత్రమే తెలుసు…తెలిసిన వారికీ ఆపద్బాంధవుడు…పేదవారికి, పిల్లలకి జోలె లోనించి ఏది కావాలంటే అది ఇస్తూ వుండే వాడు. మిఠాయిలు, ఎన్ని తినుబండారాలు పంచి పెట్టినా జోలె ఖాళీ అయ్యేది కాదు. అంటే అది అక్షయ పాత్ర అన్న మాట. ఇతడిని చుసిన వారికీ ఆ రోజంతా హాయిగా, ఆనందంగా గడిచి పోయేదట.