Explain In display Camera
How to work In display Camera
స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అందులో ముఖ్యమైనవి బాటరీ, డిస్ప్లే, కెమెరాలో రక రకాలుగా మార్పులు జరుగుతున్నాయి. బాటరీ సామర్థ్యం 3000 నుండి 5000 వరకు పెంచుకుంటూ వెళ్లారు. అదేవిధంగా డిస్ప్లే ఎల్సిడి, LED, సూపర్ AMOLED, ఇలా డెవలప్ చేసారు. కెమెరా మొదట సింగల్ కెమెరా ఉండేది. ఇపుడు డ్యూయల్ కెమెరాతో, ట్రిపుల్ కెమెరా తో ఆకట్టుకుంటున్నారు.
ఈ కెమెరా విషయంలో పంచ్ హోల్ కెమెరా, వాటర్ డ్రాప్, నాచ్ డిస్ప్లే అని, అంతే కాకుండా ఫ్లిప్ కెమెరా, స్లైడ్ కెమెరా అనీ మరీ ముందుకెళ్లి డిస్ప్లే లోనే కెమెరా అమర్చడం జరిగింది. దీంతో ముందు కెమెరా వుందా లేదా అనే సందేహం కలుగక మానదు. దీనివలన మొబైల్ ఫుల్ స్క్రీన్ తో మనకు లభిస్తుంది. సెల్ఫీ తీసుకోవాలనుకున్నపుడు కెమెరా కి సంబంధిన ఆప్ ని టచ్ చేయగానే కెమెరా ఆన్ అయి మనకు ఆప్షన్స్ ని చూస్పిస్తుంది.
ఇలాంటి ఇండిస్ప్లే కెమెరా వున్నఫోన్ ని క్రింది వీడియో లో చూడవచ్చు.