తల్లి పోలిక :
బాధగా కూర్చున్న ఎనిమిదేళ్ల కూతుర్ని తల్లి ఇలా అడిగింది..
ఎమ్మా ఏమైంది ! ఎందుకంత బాధగా కూర్చున్నావు…?
చెప్పమ్మ ! నేను పిచ్చిదానిలా ఉన్నానా …? అడిగింది కూతురు.
ఉండవు తల్లి!
నా ముక్కు బండగా వుంటుందా…?
లేదమ్మా !
నేను లావుగా డ్రమ్ములా ఉన్నానా …?
ఛీ …ఛీ..ఎవరన్నారే…?
నేను కుక్కలా ఎప్పుడూ మొరుగుతుంటానా …?
అయ్యో ! అవేం మాటలే…?
మారేందుకు నన్నంత మీ అమ్మలా వున్నావు అంటారు…?