పులుపు, తీపి కలిగిన వాక్కాయ నేరుగా తిన్నా, కూరలు లేదా రోటి పచ్చడి చేసుకుని తీసుకున్నా ఆ రుచే వేరు. అంతే కాదు వీటితో పోషకాలు కూడా అధికమే.
వాక్కయాల్లో ఐరన్ అధికంగా లభిస్తుంది. రక్త హీనత ఉన్న వారు, ప్రెగ్నెన్సీ వున్న వారు తినడం వలన ఐరన్ లోపం దూరం అవుతుంది. అలానే రకంలో వ్యర్ధాలు బయటకు వెళ్లి పోతాయి.
వీటిలో సి విటమిన్ సమృద్ధిగా దొరుకుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరంలో కొత్త కణజాల వృద్ధికి తోడ్పడుతుంది.
గుండె పని తీరుని మెరుగు పరచడంలో ఉపయోగపడుడుంది.
నాలుగు లేదా ఐదు కాయలని నేరుగా లేదా ఉప్పుతో కలిపి తీసుకుంటే మలబద్దకం తగ్గుతుంది. అరుగుదల గబా ఉంటుంది. జీర్ణాశయం పనితీరు మెరుగుగు పడుతుంది.
మధుమేహం ఉన్నవారు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.
వాక్కాయలు దంతాలకు కుండా ఎంతో మేలు చేస్తాయి. వీటిని నమలడం వలన దంతాలు శుభ్రపడతాయి.