క్యారెట్ కూర తింటాం. సాంబారులో వేసుకుంటాము. ఇకపై వీలు ఉన్నప్పుడల్లా క్యారెట్ రసం కూడా తాగితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
క్యారెట్ లో ఏ, సి, కే, విటమిన్లు మరియు పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ఏ విటమిన్ ఊపిరి తిత్తుల్లో కఫం చేరకుండా చేస్తుంది. ఇక సి విటమిన్ వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది.
క్యారెట్ రసాన్ని తరచూ తీసుకోవడమే కాదు, అందులో కాస్త తేనే కలిపి చుడండి జలుబూ, గొంతు నొప్పి, త్వరగా తగ్గుతాయి.
జుట్టు ఆరోగ్యాంగా ఉండాలన్నా, చర్మం తాజాగా ఉండాలన్న, క్యారెట్ రసాన్ని మించినది లేదు. ఈ రసాన్ని రోజూ తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు కూడా కరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
శుభ్రమైన గ్లాసు జార్ లో పలుచగా కోసిన రెండు క్యారెట్ ముక్కలూ, చెంచా అల్లం తరుగూ, నిమ్మ రసం, కొద్దిగా తేనే వేసి ముఠా పెట్టాలి. మర్నాడు ఈ నీటిని తాగితే జీర్ణ సంబంధ సమస్యలు ఆపులో ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎముకలూ దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చర్మ సంభందిత అనారోగ్యాలూ దూరమవుతాయి.