Uses of Apricot – Uses of Neredu Pallu

Uses of Apricot – Uses of Neredu Pallu – Telugu

Neredu Pallu Tinada valana to Upayogalu

నేరేడుపళ్ళు తినడం వలన ఉపయోగాలు

  • డయాబెటిస్ (మధుమేహం) స్వాభావికమైన తేలిక మార్గంలో, అనగా కేవలం పండ్లు తినడం వలన అదుపు చేయగలిగే సామర్ధ్యం నేరేడు నేరేడు పండు సొంతం.  నేరేడు పండ్లలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ సి, విటమిన్ బి, కాంప్లెక్స్ లోని ఫైబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ బి 6 వంటి వాటితో పాటు కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి.  ఇక వంద గ్రాముల నేరేడు పండ్లలో 0.6 గ్రాముల పీచు ఉంటుంది. వీటితో పాటు మరెన్నో ప్రయోజనాలు వున్నాయి. వాటి గురించి తెలుసుకుందాము.
  • నేరేడు పండు డయాబెటిస్ ని నియంత్రించడమే కాదు. డయాబెటిస్ లక్షణాలైన అతిమూత్రం, బాగా దాహం అనిపించడం వంటి లక్షణాలను సమర్ధంగా తగ్గిస్తుంది.
  • నేరేడు పండ్లు అనేక రకాల నోటి సమస్యలను తగ్గిస్తాయి. చిగుర్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి.  నోటిలో వచ్చే కురుపులు పండ్లను నయం చేస్తాయి.
  • నేరేడులో పొటాషియం పాళ్ళు ఎక్కువ. వంద గ్రాముల నేరేడులో 55 మి.గ్రా. పొటాషియం ఉండటం వలన ఇది రక్త పోటును అదుపులో ఉంచుతుంది.  తద్వారా గుండె జబ్బులను, గుండె పోటును నివారిస్తుంది.
  • ఈ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉండడం వలన రక్త హీనతను సమర్ధంగా నివారిస్తాయి.  అనీమియాకు రుచికరమైన ఔషధం నేరేడు. 
  • నేరేడు లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.  పేగుల్లో వచ్చే అల్సర్లను తగ్గిస్తాయి.  డయేరియా సమస్యను దూరం చేస్తాయి.  మూలలను స్వాభావిక మార్గంలో తగ్గించే గుణం నేరేడులో వుంది.
  • నేరేడులోని పాలీఫినాల్ వంటి ఫైటోకేమికల్స్ క్యాన్సర్లతో పోరాడతాయి.  అందుకే నేరేడుతో ఎన్నో రకాల క్యాన్సర్లు నివారితమవుతాయి. 
  • ఈ పండ్లు ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top