The Pumpkins Make the Heart Five Different Ways in Telugu
Gummadi Vittanalato Gundeki Padilam
గుండె ఆరోగ్యానికి గుమ్మడి పలుకులు…
అప్పుడప్పుడూ గుమ్మడి వాడినా…ఆ గింజల పలుకుల్ని మాత్రం తినేలా చూసుకోవడం మంచిది. వాటిలో పోషకాలు ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలుసుకుందాము.
- గుమ్మడి పలుకుల్లో లభించే యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే కారకాలతో పోరాడతాయి. శరీరాన్ని చురుకుగా ఉంచడమే కాదు మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లతోపాటు మెగ్నీషియం వంటి ఇతర పోషకాలు గుండె, కాలేయాన్ని, ఆరోగ్యాంగా ఉంచుతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
- ఒత్తిడి అనిపించినపుడు దానినుండి బయటపడటానికి కాసిన్ని గుమ్మడి గింజల పలుకుల్ని తిని చుడండి. చాలా తక్కువ సమయంలోనే రిలీఫ్ లభిస్తుంది. అలానే వీటిలో వుండే పీచు జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.
- పావుకప్పు గుమ్మడి గింజల పలుకులు తీసుకుంటే ఒక రోజులో మన శరీరానికి అవసరమైన మెగింషియం సగం అందినట్లే. గుండెకు రక్తప్రసరణ సజావుగా సాగడంతో పాటు ఎముకలు, పళ్ళు కూడా దృఢంగా ఉంటాయి. ఈ గింజల్ని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య కూడా అదుపులో ఉంటుంది.
- వీటిలో జింక్ అధికంగా లభిస్తుంది. శరీర కణాల వృద్ధికి, కళ్ళు ఆరోగ్యాంగా ఉండేందుకు ఈ పోషకం ఉపయోగపడుతుంది.
- గుమ్మడి గింజల్లో సహజంగా ఫైటోస్ట్రోజెన్స్ శరీరంలో మంచి హెచ్ డీఎల్ ను పెంచుతాయి. శరీరంలో వేడి ఆవిర్లు, తలనొప్పులూ, కీళ్ల నొప్పులు వంటి మెనోపాజ్ సూచనల్ని అదుపులో ఉంచుతుంటుంది.