Ten Tips for Beautiful Teach-Tips in Telugu, Health tips in Telugu, Famous Health Tips in Telugu, Best tips for Beautiful Teeth.
అందమైన పళ్ళు కోసం ఆయుర్వేద చిట్కాలు.
- నిత్యం ఒక చెంసేడు నల్ల నువ్వులు బాగా నమిలితిని, నీళ్లు తాగితే దంతాలు దృడంగా తయారవుతాయి.
- దంతాల్లో ఏర్పడిన గుంతల్లో ఇంగువను ముద్దగా చేసి ఉంచితే నొప్పి తగ్గుతుంది.
- కర్ర బొగ్గుని మెత్తగా చేసి దానితో పళ్ళు తోమితే చిగుళ్లవాపులు, దంతవ్యాధులు తగ్గును.
- పసుపు కొమ్మును నిప్పుపై కాల్చి దానిని మెత్తగా చూర్ణము చేసి దంతధావనం చేస్తే మంచి ఫలితం వుంటుంది.
దంతాలు తెల్లగా మెరవాలంటే…
- టీ, కాఫీ లను రోజులో అనేక సార్లు తాగే అలవాటు తగ్గించుకోవాలి.
- తక్కువ వ్యవధిలో కప్పుల కొద్దీ కాఫీ లేదా టీ తాగడం వల్ల పండ్లపై మచ్చలు ఏర్పడతాయి….ఎక్కువ విరామం తీసుకుని తాగితే మంచిది.
- ఏదైనా తాగినప్పుడు తిన్నపుడు నోటిని శుభ్రం చేసుకుంటే మంచిది.
- రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం మంచిది.
నోటి చేదు వాసన నివారణకు….
- ప్రతిరోజూ కొన్ని పుదీనా ఆకులు నమిలితే నోటి చెడువాసన పోతుంది.
- లవంగాలను బుగ్గన ఉంచుకొని చప్పరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
- రోజూ టీట్రీ ఆయిల్ కొంచెం నోటిలో వేసుకుని పుక్కలిస్తే మంచి ఫలితం ఉంటుంది.
- సోపు గింజలు నమలడం వల్ల కూడా నోటి దుర్వాసన నుండి విముక్తి పొందవచ్చు.
పళ్ళు దృడంగా వుండాలంటే…
- మర్రి పుల్లతో కానీ, మేడి పుల్లతో కానీ, కానుగ పుల్లతో కానీ, వేప పుల్లతో కానీ రెండుపూటలా సున్నితంగా నిదానంగా పళ్ళు తోమాలి. దీని వలన పళ్ళు క్రమంగా దృఢంగా మారుతాయి.
- ఒక జామ ఆకును శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి నోటిలో వేసుకుని బాగా నమిలి, ఆ రసాన్ని, దంత మూలాలకు తగిలే విధంగా నాలుకతో రుద్ది అరగంట తరువాత నోరు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.