ఒకరోజు భార్య పార్టీకీ వెళ్లి బాగా లేటుగా వస్తుంది. అప్పటికే అలసిపోయి, బాగా నీరసంగా, కొంచెం కోపంతో, మరికొంచెం నిద్ర ముంచు కొచ్చే సమయం అవటంతో హడావుడిగా బెడ్రూంలో అడుగుపెట్టింది. అడుగు పెట్టడం ఆలస్యం బెడ్ మీద నాలుగు కాళ్ళు కనిపించాయి. అసలే చిరాకలో వున్న భార్య ఆ నాలుగు కాళ్ళను చూసి కోపం ఆకాశమంత అయిపోయింది. అటు ఇటు దిక్కులు చూసింది. మూలన ఒక క్రికెట్ బ్యాట్ కనిపించింది. అంతే కోపంతో తన శక్తినంతా ఉపయోగించి చితక కొట్టుడు కొట్టి అక్కడ నుండి హాల్లో కి వచ్చి కూర్చుండి పోయింది. ఇంతలో తన భర్త ఎదురు చూసి, చూసి, తలనొప్పి అనీ టీ పెట్టుకుని చిన్నగా కిచిన్ నుంచి హల్ లోకి వచ్చాడు.
దాంతో తనకేమీ అర్ధం కాక మీరు ఇక్కడ వున్నారు. మరి బెడ్ రూమ్ లో…అనే లోపల ..
అది బంగారం …. మీ అమ్మా, నాన్న వచ్చారు. వాళ్లకి మన బెడ్ రూమ్ లో పడుకోబెట్టి నేను ఇలా వచ్చాను అన్నాడు. దాంతో వాళ్ళ అత్తా మమాలకంటే ముందు భార్యను హాస్పిటల్ లో చేర్చాడు…