Telugu Comedy Jokes
Jokes in College, Telugu Fun Jokes
Professor Vs Student Jokes
Telugu Jokes Teacher Vs Student
తెలుగు కామెడీ జోక్స్| సార్ “నటురే ” మీనింగ్ చెప్పారా?
ఒక స్టూడెంట్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లి నేచర్ మీనింగ్ ఏంటి సార్ ? అని అడిగాడు. ప్రొఫెస్సర్ ఆ పదం ఎప్పుడు విని ఉండక పోవడం వల్ల కంగారుపడి ఆ…నేను రేపు చెబుతాను అని తప్పించుకున్నాడు. తరువాత ప్రొఫెసర్ అన్ని డిక్షనరీలు తిరగేసాడు ఐన తనకి అలంటి పదం దొరకలేదు.
మర్నాడు క్లాసుకి రాగానే స్టూడెంట్ ఆతృతగా మీనింగ్ చెప్పమని అడిగాడు. మల్లి ప్రొఫెసర్ రేపు చెబుతాను అని చెప్పాడు. రోజూ స్టూడెంట్ అడగడం…. ప్రొఫెసర్ తప్పించుకోవడం … ఆ స్టూడెంట్ కనబడితే చాలు ప్రొఫెసరికి కాళ్లు, చేతులు ఆడటం లేదు.
ఆఖరికి ప్రొఫెసర్ స్టూడెంట్ ని పిలిచి నటురే స్పెల్లింగ్ చెప్పమని అడిగాడు.
స్టూడెంట్ చెప్పాడు ‘NATURE’ అని చెప్పాడు.
ప్రొఫెసర్ పిచ్చి కోపంతో ఊగిపోతూ తిట్టసాగాడు. వెధవ నేచర్ ని పట్టుకుని నటురే అని నా ప్రాణం తీశావు కాదురా…సచ్చినోడా. నిన్ను కాలేజీ నుంచి వెంటనే డిస్మిస్ చేస్తున్నాను అని చెప్పాడు.
ఆలా అనగానే స్టూడెంట్ ప్రొఫెసర్ కాళ్లమీద పడి ఎదవ సాగాడు.
సార్ క్షమించండి సార్ ! అంతపని చెయ్యొద్దు సార్ ! నా పుటురేని నాశనం చెయ్యొద్దు సార్ అనగానే …ఆ మాట విన్న ప్రొఫెసర్ స్పృహ తప్పి పడిపోయాడు.