Tech News in Telugu : Coming Soon without battery Smart Phones.
ప్రపంచములో స్మార్ట్ ఫోన్ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బాటరీ సామర్థ్యం 5000 mah వరకు పెంచారు. 1 నుండి 1.15 ని. లలో 90% ఛార్జింగ్ అయ్యే విధంగా ఇప్పుడు అందుబాటులో వున్నాయి. ఐతే ఈ ఫోన్ వాడినంత సేపు ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతుందోనని ఒక టెన్షన్ ఉంటుంది. ఇక ముందు ఆ టెన్షన్ కి చెక్ పెట్టె అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బాటరీ లేని ఫోన్స్ మార్కెట్లోకి రానున్నాయి. వాషింగ్ టన్ యూనివర్సిటీ పరిశోధకులు బాటరీ అవసరం లేకుండా రేడియేషన్ ఆధారంగా పనిచేసే మొబైల్స్ ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం.