Six Small Useful Health Tips in Telugu, Health tips in Telugu.
దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పుడు ప్రతి రోజు ఉదయం మూడు కప్పుల నీళ్లలో రెండు తమలపాకులు, నాలుగు మిర్యాలు వేసి సగం అయ్యేవరకు నీటిని మరిగించి అందులో ఒక టీ స్పూన్ తేనే కలుపుకొని తాగితే నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
దానిమ్మ తొక్కలను పొడి చేసి, ఉదయాన్నే ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ పొడి తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది.
దగ్గునుంచి ఉపశమనానికి తులసి ఆకులను తేనే కలిపి పరగదూపిన తీసుకోవడం మంచిది.
వెన్ను నొప్పితో బాధపడుతుంటే అల్లం పేస్టుతో మర్దన చేస్తే నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.
నువ్వులనూనె లేదా ఆముదంలో వెల్లుల్లు రేఖలు వేసి ఐదు నిముషాలసేపు సన్నని మంటమీద మరిగించాలి. ఈ నూనెతో వెన్నుకు మర్దన చేయాలి. వీటికి బదులుగా ఏదైనా వంట నూనెను కూడా వాడవచ్చు.
గాయాలు రక్తం కారుతుంటే చందనం పొడిలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసుకుని గాయానికి రాయాలి.