Seven Amazing Health Benefits of Allam Tea in Telugu
Allam Tea to Kalige Labhalu
అల్లం టీ తో కలిగే లాభాలు
మన వంటింట్లో ఉండే పదార్ధాలలో అల్లం ఒకటి. ఈ కాలంలో దీన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంట మంచిదాని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో క్రింది విషయాలను గమనించ వచ్చు.
- అల్లంలో జింజరోల్ అనే శక్తివంతమైన ఔషధ గుణం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ బారి నుండి శరీరాన్ని కాపాడు తుంది. దీనికి యాంటీ ఇంప్లమాటిరి, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువ.
- ఈ కాలంలో అజీర్తి సమస్య వేధిస్తుంది. దాన్ని అదుపులో ఉంచాలంటే అల్లం వీలైనంత ఏక్కువ తీసుకోవడం మంచిది. కుదిరితే రోజుకో సారి అల్లం టీ తాగడం మంచిది. దానివల్ల కడుపుబ్బరం దగ్గు, జలుబు లాంటి సమస్యలు అదుపులో ఉంటాయి.
- రెండు చెంచాల అల్లం తురుమును ఒకటిన్నర కప్పు నీటిలో వేసి మరిగించాలి. అల్లం సారం నీటిలోకి చేరి మంచి వాసన వస్తున్నపుడు దింపి వేయాలి. ఇందులో కొద్దిగా తేనే రెండు పుదీనా ఆకులూ వేసుకుని తాగితే మంచిది.
- అల్లం తరచూ తీసుకునే వారిలో పోరోసిస్ వచ్చే ప్రమాద చాల తక్కువని వైద్యులు చూసేస్తున్నారు. ఆస్టియోపొరోసిస్ తో బాధపడే వారు అల్లం దాల్చిన చెక్క నూనె మిశ్రమాన్ని కీళ్లపై రాసి మృదువుగా మర్దన చేసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గి మంచి ఉపశమనం లభిస్తుంది.
- అల్లం లో శక్తివంతమైన యాంటీ బయాటిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చెక్కర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
- నెలసరి సమయంలో వచ్చే నొప్పులను అదుపులో ఉండాలంటే ఆ మూడు రోజులు పావు చెంచా చొప్పున అల్లం పొడిని నీటిలో కలిపి తీసుకోవంతో మంచి ఉపశమనం లభిస్తుంది.