Noti Durvasanaku Inti Vydham-Telugu Health Tips
ఉప్పుతో :: ఉప్పు నీళ్లు నోటిని ఆరోగ్యాంగా ఉంచే సహజ సిద్ద మౌత్ వాష్. కప్పు గోరువెచ్చని నీళ్లలో పెద్ద చెంచా ఉప్పు కలపాలి. ఈ నీటితో పుక్కలిస్తే చిగుళ్లకు సంబందించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ముక్యంగా భోజనం చేసిన తరువాత ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
వెనిగర్ : కప్పు ఉన్నపునీళ్లలో రెందు చెంచాల వెనిగర్ కలపాలి. ఈ నీటిని ఒక సీసాలోకి తీసుకోవాలి. ఈ నీటిని ఓ సీసాలోకి తీసుకోవాలి. దీన్ని ఫ్రిజ్ లో ఉంచుకుంటే వారం పాటు నిల్వ ఉంటుంది. చిన్న మూతలో ఈ నీటిని తీసుకుని అవసరమైనప్పుడు పుక్కిలించి ఉమ్మితే సరిపోతుంది. ఇంకా అనుదుబాటులో ఉంటే ఆపిల్ సిడార్ వెనిగర్ వాడితే మంచిది.
దాల్చిన చెక్కతో : ఒక కప్పు చల్లని నీళ్లలో పది చుక్కల లవంగాల నూనె లేదంటే చెంచా దాల్చిన చెక్క పొడి కలపాలి. ఇది మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. లవంగం, దాల్చిన చెక్క లలో వుండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసన తగ్గిస్తాయి.
పుదీనా తో : ఒక కప్పు నీళ్లలో రెండు చెంచాల వంట సోడా, గుప్పెడు పుదీనా ఆకులు వేయాలి. అందుబాటులో ఉంటే రెండు చుక్కల టీట్రీనునే కలుపుకుంటే మంచిది. ఈ మిశ్రమాన్ని ఓ సీసాలో భద్ర పరుచుకుంటే సరిపోతుంది. దీన్ని వాడాలనుకున్నపుడు సీసాను ఒకటి రెండు సార్లు కుదపడం తప్పనిసరి. లేదంటే వంట సోడా అడుగుని ఉండిపోతుంది.