Mrokkubadulu Chellinchakunte Devudiki Kopam Vastunda-Telugu
మ్రొక్కు బదులు చెల్లించకుంటే దేవుడికి కోపం వస్తుందా….!
తల్లికి బిడ్డల మీద కోపం వస్తుందా….? ఇదీ అంతే. భగంతుడు ఆశించేది ధర్మ , న్యాయాలతో జీవితాన్ని గడపమని. మ్రొక్కులు తీసుకుని మన పాపాలని స్వీకరించాడు. మ్రొక్కులు తీర్చలేదని కష్టాలు పెట్టడు. ఎవరు చేసిన కర్మలను బట్టి వారి వారి పాప పుణ్యాలను అనుభవించక తప్పదు. కష్టమొస్తే భగవంతునికి మొక్కుకుని, తీరిన తరువాత మర్చిపోయిన వారికీ, మళ్ళీ కష్టంలో ఆ మ్రొక్కు గుర్తుకు వచ్చి కుటుంబ సమేతంగా ఆ మ్రొక్కు తీర్చు కుంటారు. భగవంతుడెప్పుడూ మాట మీద సత్యం మీద నిలిచి ఉండమంటాడు. దాన్ని మీరితే అది మీ సమస్య, ఆయన సమస్య కాదు.