Telugu Jokes, Wife and Husband Jokes, Telugu Comedy Images ,Funny Jokes in Telugu, Telugu Famous Jokes and Pictures.
Joke of the day -Very Funny Jokes in Telugu and Wife and Husband Telugu Jokes and Images.
పొద్దున్నే నిద్రపోతున్న భార్యను నిద్రలేపాడు కాంతారావు…!
భర్త : ఏమోయ్ ఇద్దరం కలిసి సరదాగా జాగింగ్ కి వెళదామా …?
భార్య : అంటే నేను లావెక్కననేగా నీ ఉద్దేశం !
భర్త : అదేం కాదోయ్, జాగింగ్ చేయడం ఆరోగ్యానికి మంచింది కదా అని అడిగాను.
భార్య : అంటే నేను రోగిష్టిదానినసెగా అంటున్నారు?
భర్త : అదికాదోయ్…సర్లే నీకు లేవడం ఇష్టం లేకపోతె సరే వదిలేసేయ్…
భార్య : ఓహో, రూటుమార్చారు నేను బద్దకస్తురాలిననేగా మీ ఉద్దేశం.
భర్త : అయ్యో అదికాదు నువ్వు నా మాటలని అపార్థం చేసుకుంటున్నావు. నేను చెబుతున్నది ఏంటంటే…
భార్య : ఎం చెబుతున్నారు? మీ మాటలు నాకు అర్ధం కావు అనుకుంటున్నారా ? నాకు తెలివి లేదా ?
భర్త : అబ్బా ! నేను ఆలా ఎప్పుడు అన్నాను ?
భార్య : మరి నేను అబద్దాలు ఆడుతున్నానా?
భర్త : తల్లీ నీకు ఒక దణ్ణం పెడతాను, పొద్దున్నే అనవసరంగా గొడవపడకు
భార్య : ఓహో.. నేను తగాదాల పోరుననేగా మీరు అనేది?
భర్త : ఒసేయ్…! నన్ను క్షమించి నువ్వు పాడుకోవే… నేను ఒక్కడినే జాగింగ్ కి వెళతాను
భార్య : బాగా ఎంజాయ్ ఏహేయ్యటం కోసం మీరు ఒక్కరే జాగింగ్ కి వెళ్లడం అలగవతే కదా ?
భర్త : హు ..నాకు కళ్ళుతిరుగుతున్నాయి నేను అసలు జాగింగుకే వెళ్ళాను.
భార్య : అయినా మీరు చాల స్వార్ధపరులు, ఎంతసేపు మీ గురించే ఆలోచిస్తారు కానీ నా ఆరోగ్యం గురించి ఆలోచనే లేదు. డాక్టర్ గారు చెప్పిన మాట మరిచిపోయినట్లురున్నారు. డాక్టర్ గారు న్నాడు రోజు కాసేపు నడవమన్నారు కదా…?
భర్త తలపట్టుకుని ఇప్పటికీ అసలు తప్పు ఎక్కడ జరిగిందా అని ఆలోచిస్తూ వున్నాడు.