How to Hide Whatsapp Chat – Tech Tips in Telugu
వాట్సాప్ చాట్ ని దాచెయ్యడం ఎలా…
Whatsaap లో చాటింగ్ చేస్తూ ఉంటాం. అందులో మనకు కొన్ని చాట్స్ సీక్రెట్ గఉంచుకోవాలని అనుకుంటాం. అది సాధ్యమేనా అని అంటే సాధ్యమనే చెప్పాలి. దానికోసం ఇలా ప్రయత్నించండి.
- ముందుగా వాట్సాప్ ఓపెన్ చెయ్యండి.
- ఎవరి చాట్ దాచేయాలనుకుంటున్నామో ఆ చాట్ పై ప్రెస్ చేసి పట్టుకోండి.
- పై భాగంలో బాణం గుర్తు కిందికి చుపిస్తున్నట్టుగా వుండే ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఇప్పుడు దానిని ఎంచుకోండి.
- అంతే మీ చాట్ లిస్ట్ లో నుంచి అది కనిపించకుండా పోతుంది.
- అందుకోసం కింద ఉన్న ఇమేజెస్ గమనించగలరు.
అదేవిధంగా… అన్ని కనిపించకుండా చెయ్యాలి అంటే…
- పై భాగంలో వున్నా మూడు చుక్కలు ఉన్న వాటిపై క్లిక్ చేయండి.
- సెట్టింగ్స్ లోనికి వెళితే అందులో చాట్, చాట్ హిస్టరీని ఎంచుకోండి.
- తరువాత ఆర్చీవ్ అల్ పైన క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ వాట్సాప్ లిస్ట్ లో వున్న చాట్స్ ఇతరులకు కనపడవు.
మరి మళ్ళీ మనకు అవసరమైనపుడు రికవరీ చేసుకోవడం ఎలా….
- మొదట వాట్సాప్ ఓపెన్ చేయండి.
- చాట్స్ టాబ్ లోనుండి స్క్రీన్ బాటమ్ కు స్క్రోల్ చేస్తూ వెళ్ళండి.
- అక్కడ ఆర్చీవ్ ఆప్షన్ ఉంటుంది. దానిపై పై భాగంలో బాణం గుర్తు పైకి చుపిస్తున్నట్లుగా ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే హైడ్ ఐన చాట్స్ మల్లి కనిపిస్తాయి.