Ho to get rid of Dandruff Natural Treatment-Telugu Tips
Chundru Nundi Vimukti Pondadam Ela…?
చుండ్రు నుండి విముక్తి పొందడం ఎలా….?
చుండ్రు రెండు రకాలు. వాటిల్లో వాతంకారణంగా వచ్చే పొడి చుండ్రు ఒక రకం. ఈ చుండ్రు పొడి పొడిగా రాలుతుంది. దీనికి వైద్యంగా మూడు చెంచాల త్రివల చూర్ణాన్ని ఒక లీటరు నీళ్లలో వేసి మరిగించాలి. కాషాయం 800 మీ.లీటర్లు మిగిలే దాకా కాచి చల్లార్చాలి. గోరు వెచ్చగా వున్నపుడే ఈ కషాయంతో తలను శుభ్రపరచాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఐన శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత దుర్వాది కేరమ్ అనే తైలాన్ని రోజుకు ఒకసారి చొప్పున వారానికి నాలుగు రోజులైనా వాడాలి. ఇలా రెండు మాసాల పాటు చెయ్యాలి. దీనికి తోడు పావు చెంచా తులసి పొడిని ఉదయం, పావు చెంచా పొడిని రాత్రి తీసుకోవాలి. దీనికి కాల నియమం ఏమి లేదు ఎప్పుడైనా వేసుకోవచ్చు.
కఫం కారణంగా వచ్చే ఫంగస్ చుండ్రు మరొక రకం. ఇందులోను పొడి రాలిన, కాపీలమంతా జిడ్డుగా ఉంటుంది. ఒకరోజు స్నానం చేయకపోయినా మట్టి మట్టిగా అనిపిస్తుంది. వీరు వెట్ప్ ల తైలం తలకు పట్టించి గంట తరువాత స్నానం చెయ్యాలి. వారానికి మూడు రోజులైనా ఇలా చెయ్యాలి. ఆ తరువాత ‘ఖదిరరిష్టం’ పొడిని 3 చెంచాలు రాత్రికి భోజనం తరువాత వేసుకోవాలి. ఇలా నెల రోజులు కొనసాగించాలి.
ఈ రొండు రకాల చుండ్రుల్లోనూ వాడాల్సిన మరొక వైద్యం … 100 గ్రాముల ఉసిరి పొడి, 50 గ్రాముల గుంటగలగర ఆకు పొడి, 50 గ్రాముల కుంకుడుకాయ పొడి, రెండు చెంచాల వేప నూనెలను కలిపి వేడి నీళ్లతో పేస్ట్ లా తయారు చేసుకుని వెంట్రుకలకు ప్యాక్ ల వేసుకోవాలి. గంట తరువాత కడిగేయాలి. వారానికి ఒక్కరోజైనా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.