Friends Thanks for Coming : How to create a blog for free-Telugu.
బ్లాగ్ ని క్రియేట్ చేయడం ఎలా….?
తెలుగులో నేర్చుకుందాము.
What is a purpose of crating a blog.
చాలామంది బ్లాగ్ అనగానే మొదట భయపడే ఉండవచ్చు. కానీ అలంటి భయమేమీ అక్కరలేదు చాల సులభంగాను, ప్రశాంతగా వర్క్ చేసుకోవడానికి ఇది ఒక అడ్డా. చాలామంది ఎదో అందరు చేస్తావుంటారు మనం కూడా స్టార్ట్ చేద్దాం అని స్టార్ట్ చేస్తారు. ఎప్పుడో అమావాసకి లేదా పుణ్యాన్నికి ఒక పోస్ట్ లేదా రెండు పోస్టులు వేయడం ఆ తరువాత నా బ్లాగ్ కి విజిటర్స్ రావడం లేదు. ఇది అంట టైమే వెస్ట్ అని అనుకోవడం డ్రాప్ అయి పోవడం. ఎక్కువ శాతం ఇలాగె ఉంటుంది. అయితే ఇది ఒక సముద్రం లాంటిది. మనం ఏదైతే జనాలని లేదా సమాజానికి గాని, అంతకంటే కూడా మనయొక్క భావాలను వ్యక్త పరుచుకోవడానికి గని ఇది ఒక మంచి డైరీ లాంటిది కూడా. అయితే ఇందులో గుర్తు ఉంచుకోవాల్సిన ముఖ్యమైనవి మరియు ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయాలు కొన్ని వున్నాయి అవి ఏంటో చూద్దాం.
బ్లాగ్ ని క్రియేట్ చేయడం అనేది చాలా సులభం. ఈ బ్లాగ్ అనేది మనామాల్ని మనం నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. దీనివలన మనం మనయొక్క గుర్తింపును పెంచుకోవచ్చు అలాగే మంచి ఫాలోయింగ్ ని కూడదా సంపాదించుకోవచ్చు అయితే బ్లాగ్ని మనం ఎందుకు క్రియాట్ చేస్తున్నాము అనేది మొదటగా గుర్తుంచుకోవలసిన విషయం. దానికంటే ముందు మనం ఆ బ్లాగ్ పైన ఎంత వర్క్ చేయగలం.? ఎన్నిరోజులు చేయగలం. అన్నివిషయాలు అలోచించి ముందుగా ప్లాన్ ప్రకారంగ క్రియేట్ చేసుకోవడం మంచిది.
బ్లాగ్ చేయాలి అనే ఆలోచన వచ్చినపుడు మొదటగా గుతుంచుకోవలసిన విషయాలు.
1. ఎందుకు చేయాలి ?
2. మనం ఎంత టైమ్ వర్క్ చేయగలము.
3. ఎన్ని రోజులు, లేదా నెలలలు, సంవత్సరాలు చేయగలం.
4. ఇంకా ముఖ్యమైనది టాపిక్ /కంటెంట్ , ఎదో ఒకటి కాదు, నీకు తెలిసినది అయినా ఉండాలి, లేదా ఒకరిని చూసి రాసినా వారికంటే బాగా రాయగలిగే శక్తి అయినా వుండాలి.
5. ఇది డైరీ వంటిదే ప్రతిరోజూ కాకయినా సమయం అనుకూలించినపుడు ఖశ్చింతంగా వర్క్ చేయడం మంచిది.