How to Choose the Right Makeup for Skin-Beauty Tips in Telugu
చర్మానికి తగిన మేకప్ ఎంచుకోవడం ఎలా..?
మేకప్ తో అందం రెట్టింపు అవుతుంది. కానీ మేకప్ సరిగా వేసుకుంటే ముఖం నీరసంగా, కళ తప్పినట్లు కనిపిస్తుంది. చర్మ తత్వానికి మేకప్ ఉండాలంటున్నారు నిపుణులు.
ఫౌండేషన్ : మీ స్కిన్ టోన్ కి సరిపోయే ఫౌండేషన్ ను ఎంచుకోవాలి. మేకప్ వస్తువుల్ని కొనే ముందు మణికట్టు ముంజేతి మీద రాసుకుని చూడాలి. దాంతో మీకు ఏ స్కిన్ షేడ్ నచ్చుతుందో తెలుస్తుంది.
మాయిశ్చరైజింగ్ క్రీమ్ : ఒంట్లో నీరు తగ్గిపోయినప్పుడు ముఖం పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. దీంతో మేకప్ సహజంగా రాదు. అలాంటప్పుడు మేలైన మాయిశ్చరైజర్ లేదా సీరమ్ ను ఉపయోగించాలి. మృదువైన చర్మం ఉన్నవారు ‘సెటాఫిల్ ‘ మాయిశ్చరైజింగ్ క్రీమ్ లు వాడితే మంచిది.
మేకప్ తొలగించడం : త అలసిపోయినప్పటికీ, ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాత్రిపూట మేకప్ తొలగించడం మర్చి పోవద్దు. అలానే నిద్ర పోవడం వల్ల మేకప్ చర్మానికి హాని కలిగిస్తుంది.
మేకప్ వస్తువులు కాలపరిమితి : మేకప్ వస్తువులకు కూడా కాలపరిమితి ఉంటుంది. కాబట్టి కాలం చెల్లిన సౌందర్య సాధనాలను వాడకపోవడం మంచిది.