YUVANTECH-LOGO-5

Share Birthday Wishes & Quotes

WELCOME YUVANTECH.IN

Happy Birthday Wishes and Quotes in Telugu & English

How did the seven hills get its name-Telugu

You Know: How did the seven hills get its name-Telugu

ఏడు కొండలకు ఆ పేరు ఎలా వచ్చింది


తిరుమలలో ఉండే ఏడూ కొండలనే సప్తగిరులు అని కూడా అంటారు. శ్రీ మహా విష్ణువు శయనించిన ఆదిశేషుడి ఓడు పడగలు తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన ఏడుకొండలని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఏడు శిఖరాల్లో ఒక్కో శైలానిది ఒక్కో చరిత్ర.

శేషాద్రి – సప్తగిరుల్లో శేషాద్రి ప్రధానమైంది. ఆది శేషుని పేరిట నెలకొన్న కొండ.  

నీలాద్రి – స్వామి వారికీ మొదటి సరిగా తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదుగానే ఈ కొండా వెలసింది.

అంజనాద్రి – హనుమంతుని తల్లి సంతానం కోసం తపస్సు చేసిన కొండ  అంజనాద్రిగా వెలసింది.

వృషభాద్రి – మహావిష్ణువు చేతిలో హతమైన రాక్షసుడు వృషభాసురుడి పేరిట వృషభాద్రి వచ్చింది.

నారాయణాద్రి – విష్ణుమూర్తి దర్శనం కోసం పుష్కరిణి తీరంలో తపస్సు చేసిన నారాయణ మహర్షి పేరిట నారాయణాద్రి వెలసింది.

వేంకటాద్రి  – కలియుగ దైవం వెలసిన కొండ ఇది.  ‘వే’ అంటే పాపలు అనీ, ‘కట’ అంటే హరించడం అనీ అర్ధం.  అనగా స్వామి సన్నిధిలో సర్వ పాపాలూ నశిస్తాయని, అందుకే ఆ పవిత్ర గిరిని వేంకటాద్రి అంటరాని ప్రతీతి.

Leave a Comment

Advertisements
Advertisements