Home Remedies for Glowing Skin-Beauty Tips in Telugu
మీ ముఖాన్ని అందంగా ఇంట్లోనే దిద్దుకోవడం ఎలా ?
స్కిన్ అందంగా తాజాగా కనిపించేందుకు పార్లర్ లేదా స్పా కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాడీ బ్రష్ తో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.
- బాడీ బ్రష్ పొడిగా ఉండాలి. బ్రష్ ను సులువుగా కదిలించేలా పట్టుకుని వలయాకారంలో నెమ్మదిగా కదిలిస్తూ పాదాల నుంచి మీద వరకు బాడీ బృషింగ్ చేసుకోవాలి. గాయాలు దద్దుర్లు ఉన్న చోట బృషింగ్ చేయకూడదు.
- ముఖానికి మృదువైన బ్రిస్టిల్స్ ఉన్న డ్రై బ్రష్ ఎంచుకోవాలి. లేదంటే స్రబ్బర్ ఉపయోగించుకోవాలి.
- ఒళ్ళంతా బ్రుష్షింగ్ పూర్తయిన తరువాత స్నానం చెయ్యాలి. గోరు వెచ్చని నీళ్లతో మొదలెట్టి తరువాత మరి కొంచెం వేడి నీళ్లతో స్నానం చెయ్యాలి. దీంతో చర్మం మీది మృత కణాలన్నీ పూర్తిగా తొలగి పోతాయి.
- స్నానం పూర్తి అయ్యాక ప్రోటీన్లతో కూడిన మాయిశ్చరైసర్ ఒంటికి రాసుకోవాలి. కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి.