Health Tips : Health Benefits with Skipping-Telugu
స్కిప్పింగ్ తో ఆరోగ్య ప్రయోజనాలు
- రకరకాల వ్యాయామాలపై ద్రుష్టి సారిస్తూ కొందరు తమ శరీర సౌష్టవాన్ని సంరక్షించుకుంటే.., ఇంకొందరుమాత్రం రోజు ఒకే వ్యాయామాన్ని రోజూ అనుసరిస్తూ తమ శరీరాన్ని ఫైట్ గా ఉంచుకుంటున్నారు.
- శరీరం మొత్తానికి ఒకే వ్యాయామం, తాడాట (స్కిప్పింగ్)తో సాధ్యమవుతుందని ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ చూసిస్తున్నారు. శరీరంలోని అవయవాల కదలికను వేగవంతం చెయ్యటంతో పాటు వాటిమధ్య సమన్వయానికి స్కిప్పింగ్ తొడపడుతుంది.
- రోజూ స్కిప్పింగ్ చెయ్యటం వల్ల శరీరం దృఢత్వాన్ని సంతరించుకోవటంతో పాటు పూర్తి స్థాయిలో ఫైట్ గా తయారవుతుంది. ఎముకలు గట్టిపడటంతో పాటు చర్మం పై ఏర్పడ్డ ముడతలు తొలగిపోతాయి. స్కిప్పింగ్ హెసెసేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయడం వాళ్ళ అరికాళ్లకు నొప్పి కలుగుతుంది. ముఖ్యంగా కాంక్రీట్ నేలపై స్కిప్పింగ్ చేసేటప్పుడు బూట్లు వేసుకోవడం మంచిది.
- బరువు తగ్గించడంలో స్కిప్కింగ్ కీలకపాత్ర పోషిస్తుంది. స్కిప్పింగ్ ప్రారంభించే ముందు ఐదు నిముషాలు పాటు వార్మప్ చెయ్యడం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది. తొడలు, చేతులు, భుజాలు, పొట్ట భాగంలో ఏర్పడిన ఫ్యాట్ నిల్వలు కరిగిపోయి కండరాలు పటిష్టంగా తయారవుతాయి.