Five Effects of Sleep Deprivation of your Body-Health Tips in Telugu
Sukahmaina Nidraku 5 Mukya Karanalu
సుఖమైన నిద్రపోవడానికి కొన్ని సూత్రాలు
నిత్య జీవితంలో నిద్ర కూడా మనకు చాలా అవసరం. కానీ ఎప్పుడు వచ్చిన ఎలక్ట్రానిక్ గాడ్జెస్ వల్ల మనము నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నాము. శారీరక మానసిక ఆరోగ్యానికి నిద్ర అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి కనీసం రోజులో ఏడు లేదా ఎనిమిది గంటలు నిద్రపొతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
శారీరక సమస్యకు దూరంగా ఉండేవారికి గాఢనిద్ర వచ్చే అవకాశాలు తక్కువ రోజూ కనీసం ఒక అరగంట నడక, వ్యాయామాలు, ఆసనాలు వంటివి ప్రయత్నిస్తే శరీరం అలసిపోతుంది. దాంతో ఆటంకం లేకుండా మంచి నిద్ర పడుతుంది.
కాఫీ, టీ లలో ఉండే కెఫీన్ తోనూ నిద్ర సరిగా పట్టకపోవచ్చు. వీటిని మితంగా తీసుకోవాలి. రాత్రి భోజనం తరువాత టీ, కాఫీ లకు దూరంగా ఉండడం మంచిది.
టీవీ లు, ఫోన్లు, కంప్యూటర్ స్క్రీన్స్ విడుదల చేసే నీలిరంగు కాంతి మెదడుపై ప్రభావం చూపుతుంది. దీంతో ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. పడుకోవడానికి కనీసం గంట ముందే వీటిని ఆఫ్ చేయడం మంచిది.
నిద్ర వేళలు రోజు ఒకేలా వుండే విధంగా చూసుకోవడం మంచిది. పడుకోవడానికి గంట ముందు గ్లాసు గోరు వెచ్చని పాలు తాగితే….కాసేపటికే నిద్ర పడుతుంది.
నిద్రలేమితో భాధపడేవారు ఎదో ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకోవడం వలన మార్పు కనిపించవచ్చు. మధ్యాహన్నం నిద్రపోవడం వలన కూడా సాయంత్రం నిద్రపట్టక పోవడానికి ఒక కరంగానే చెప్పవచ్చు. ఈ విషయంలో కూడా కొంచెం ఆలోచిస్తే సాయంత్రం వేళ మంచి నిద్ర మనకు వీలవుతుంది.