Famous Funny Telugu Jokes-Jokes in Telugu
Famous Funny Telugu Jokes, Jokes in Telugu, Funny Jokes in Telugu, Telugu Comedy Jokes and Messages, Online Telugu Jokes, Telugu Comedy Messages.
బామ్మగారి దెబ్బకు బస్సు డ్రైవర్ షాక్
బామ్మగారు హైదరాబాద్ బస్సు స్టాండ్ లో వైజాగ్ బస్సు ఎక్కింది. డ్రైవర్ తో బాబు నేను నిద్ర పోతానేమో విజయవాడ రాగానే లేపుతావా ? అడిగింది బామ్మగారు.
సరే అని తల ఊపాడు డ్రైవర్. దాంతో సీట్లో కుర్చీని హాయిగా నిద్ర పోయింది బామ్మగారు.
తరువత మెలకువ వచ్చేసరికి డ్రైవెర్ ని అడిగింది. బాబూ ఇంకా విజయవాడ రాలేదా…?
డ్రైవర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి…అయ్యయ్యో మర్చిపోయాను బామ్మగారు విజయవాడ దాటి 100 కిలోమీటర్లు వచ్చేసాము అని చెప్పడంతో బామ్మా ఒక్కసారిగా ఏడుపు రాగాలతో బస్సు దద్దరిల్లిపోయింది.
ఆమె అవస్థ చూళ్లేక ప్రయాణికులంతా బస్సు డ్రైవర్ మీద విరుచుకుపడి బస్సును వెనక్కి మళ్లించారు.
డ్రైవర్ చేసేదేమి లేక విసుగ్గా బస్సు వెనక్కి తిప్పి విజయవాడకి తీసుకు వెళ్లి దిగమన్నాడు. బామ్మగారు అతనిమాటలు ఏమి పట్టించుకోకుండా రెండు మందుబిళ్లలు తీసుకుని నోట్లో వేసుకుని నీళ్లు తాగింది.
ఏమి లేదు బిడ్డా…నాకు బి.పి. వుంది. నా మనమడు విజయవాడ రాగానే ఈ రెండు బిళ్ళలు వేసుకోమని మరీ..మరీ చెప్పాడు. వాడంతే నా మీద బోలెడంత ప్రేమ వాడికి అంటూ …ఇక పోనియ్యి బాబు వైజాగ్ వెళ్ళాలి అంది.
అదివిన్న బస్సు డ్రైవర్ బామ్మ దెబ్బకు స్పృహ తప్పి పడిపోయాడు.
Famous Funny Telugu Jokes, Jokes in Telugu, Funny Jokes in Telugu, Telugu Comedy Jokes and Messages, Online Telugu Jokes, Telugu Comedy Messages.