Eight Amazing Health Benefits with Finger Millet (Ragi) -Telugu
రాగి జావతో 8 లాభాలు…
కొద్దిగా నీళ్లు, రెండు చెంచాల రాగి పిండి, ఓ బెల్లం ముక్క…ఏ మూడింటితో తయారయ్యే రాగి జావ ఒక మంచి ఆరోగ్య ప్రదాయని. వేసవి కాలంలో దీన్ని రోజుకోసారి తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతో పాటు మరెన్నో లాభాలు వున్నాయి.
- రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృడంగా ఉంటాయి.
- రాగిపిండిలో విటమిన్ – సి కూడా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం ఒక్కటే కాదు. చర్మం కూడా ఆరోగ్యాంగా ఉంటుంది.
- రాగుల్లో ఇనుము మోతాదు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్త హీనతతో బాధపడే వారు తమ ఆహారంలో రాగుల్ని చేర్చుకుంటే మంచిది.
- రాగుల్ని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
- రాగిపిండిలో పలు రకాలైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడి, ఆందోళనలును తగ్గిస్తాయి. అంతే కాకుండా కండరాల ఆరోగ్యానికి , రక్తం తయారవడానికి జీవక్రియలు సాఫీగా జరగడానికి ఇది ఎంతగవు తోడ్పడుతుంది.
- రాగుల్లో మాంసకృత్యులు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ చిరుధాన్యాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు.
- రాగి పిండి రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
- బరువు తగ్గాలనుకునే వారు రాగులను తరచుగా చేర్చుకోవాలి. జావా రూపంలోనే కాదు సంగటి రూపంలో కూడా రాగి పిండిని తీసుకోవచ్చు.