Tack Care : Health Tips in Telugu, Effects of Earphones in Telugu, Side Effects of using Earphones in Telugu.
ఇయర్ ఫోన్స్ లేని జీవితాన్ని ఉహించుకొనేంతగా అవి మన జీవితంలో భాగమైపోయాయి. వాటితో ఉపయోగలమాట ఎలావున్నా ఆరోగ్యమైన సమస్యలు బోలెడన్ని వున్నాయి. అవేంటో తెలుసుకుందాము.
హోరెత్తే సంగీతం : ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న మ్యూజిక్ సౌండ్ బయటకి వినిస్పిస్తుందట మనం అవసరానికి మించిన వాల్యూమ్ పెట్టుకున్నామని అర్ధం. అధిక శబ్దం చెవిలోని నేరాల పై పొర మెలీన్ ను దెబ్బతీస్తాయి.ఈ పోరా చెవి తరంగాలను మెదడుకు చేరవేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పోరా దెబ్బతింటే తాత్కాలికంగా లేదా శాస్వితంగా వినికిడి శక్తి దెబ్బతింటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి గంటకొకసారి హెడ్ ఫోనెను చెవుల నుంచి తొలగిస్తూ ఉండాలి.
ఇయర్ ఫోన్ ఇన్ఫెక్షన్ : చెవుల లోపలి వెళ్లి ఉండే ఇయర్ ఫోన్స్ వల్ల చెవి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. హెడ్ ఫోన్స్ షేరింగ్ వల్ల కూడా ఒకరినించి మరొకరికి చెవి ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. ఇతరుల హెడ్ ఫోన్స్ వాడుతుండేవారి చెవులను పరీక్షించినపుడు షుమారు 98%మంది చెవుల్లో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు ప్రయోగాల్లో తేలింది. ఇయర్ ఫోన్స్ వాడకం వల్ల చెవుల్లో తలెత్తే వేడి, తేమ బాక్టీరియా పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఓ గంట పాటు హెడ్ ఫోన్స్ ఉపయోగిస్తే బాక్టీరియా 700రెట్లు పెరుగుతున్నట్లు ప్రయోగాల్లో తేలింది.
శుభ్రత :
- నాలుగు వారాలకు ఒక సరి ఇయర్ బడ్స్ మారుస్తూవుండాలి. హెడ్ ఫోన్స్ బడ్స్ లను శానిటైజ్ చేస్తూ ఉండాలి.
- ఇతరులతో హెడ్ ఫోన్స్ ఎక్స్చేంజి చేసుకోకూడదు.
- తక్కువ మోతాదులో మ్యూజిక్ వింటూ గంట కొక సారి చెవులకు విశ్రాంతినిస్తూ ఉండాలి.
- ఇలా చేయడం వలన ఇయర్ ఫోన్స్ తో కలిగే ప్రమాదాల నుండి బయట పడవచ్చు.