Dalchina Chekkato Arogyam-Health Tips in Telugu, Famous Telugu Health Tips.

దాల్చిన చెక్కతో ఆరోగ్యం…
దాల్చిన చెక్క… వంటల రుచిని సువాసనను పెంచే మసాలా దినుసు కాదు ఆరోగ్యాన్ని కాపాడే ఔషధం కూడా. నూనె రూపంలోనూ లభించే దాల్చిన చెక్క చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఈ సుగంధ ద్రవ్యం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.
- దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. ఇవి ప్రీరాడికల్స్ ని తొలగించి, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
- జీర్ణ సంబంధ సమస్యలకు దాల్చిన చెక్క ముందుగా పని చేస్తుంది. దీనిలోని పీచు పదార్ధం కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు ఆకలిని పెంచుతుంది.
- దాల్చిన చెక్క నూనె ఒంటికి రాసుకుంటే ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఉంటాయి.
- దీనిలోని యాంటీ ఇన్ ఫ్ల మేటరీ గుణాలు రక్త సరఫరా సవ్యంగా జరిగేలా చూస్తుంది.
- దీనిలోని ప్రోటీన్లు చర్మం మీద ముడతల్ని నివారించి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. తేనే, దాల్చిన చెక్క పొడి మిశ్రమం ముఖాన్నీ తాజాగా ఉంచుతుంది.
- కొలెస్ట్రాల్ ఉత్పత్తికి కారణమయ్యే ఎంజైమును నియంత్రించి రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చూస్తుంది. గుండె సంబంధ వ్యాధులను నివారిస్తుంది.
- పలురకాల క్యాన్సర్ల ముప్పునుండి దాల్చిన చెక్క నివారిస్తుంది. వీటిలోని మెగ్నీషియం, కాల్షియం తో కలిసి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
- వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచి కురులు పెరిగేందుకు తోడ్పడుతుంది.