Dee Hyderation Kosam Konni Sutralu-Telugu
కాలంతో సంభందం లోకూడా ఇప్పుడు అందరిని డీ హైడ్రాషన్ సమస్య వేధిస్తుంది. అలాంటివారు ఈ పదార్ధాలు తీసుకోకపోవడం మంచిది.
కీరా : నీటి శాతం అధికంగా వుండే కీరదోస ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. ఇది శరీరంలోని వేడిని బయటకు పంపేసి చల్లగా మారుస్తుంది. ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. దీన్ని గుండ్రంగా కోసి కళ్ళ మీద పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. శరీరంలో వేడి తగ్గుతుంది.
ముల్లంగి : విటమిన్ సి, నీటి శాతం అధికంగా వున్న ముల్లంగిని కూరల్లో భాగం చేసుకుంటే డీ హైడ్రాషన్ సమస్య తగ్గుతుంది.
సొరకాయ, బీరకాయ : శరీరంలో నీటి నిల్వలు కోల్పోకుండా చేస్తాయి ఇవి. జ్వరంతో భాదపడుతున్నపుడు గర్భిణీలకు ఈ ఆహారాన్ని ఎక్కువగా ఇస్తుంటారు. వీటిల్లో పీచు జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగు పరుస్తుంది. ముక్యంగా బీరకాయలో సి విటమిన్, జింక్ థయామిన్ వంటి పోషకాలు ఉంటాయి.