Five Important Causes of Head Pain-Telugu
తలనొప్పికి గల కారణాలు
నిత్య జీవితంలో తలనొప్పి సర్వ సాధారణం అయ్యింది. ఎదో ఒక టైం లో ప్రతి ఒక్కరూ దీని భారిన పడి సతమతమవుతూ వుంటారు. ఒత్తిడితో పాటు పరోక్షంగానూ కొన్ని అంశాలు తలనొప్పికి దారి తీయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాము.
- నీటి శాతం తగ్గడం : అకారణంగా తలనొప్పి వేధిస్తుంటే ఎన్ని నీళ్లు తాగుతున్నారో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. నీటి శాతం తగ్గినా (డీ హైడ్రాషన్) తలనొప్పి రావచ్చు. ఒంట్లో నీరు తగ్గినప్పుడు మెదడు తాత్కాలికంగా కుంచించుకు పోతుంది. దీంతో మెదడు పుర్రె నుంచి కాస్త వెనక్కి జారి, నొప్పికి దారి తీస్తుంది. తగినన్ని నీళ్లు తాగగానే యదా స్థితికి వస్తుంది.
- సరిగా తినకపోవడం : భోజనానికి, భోజనానికి మధ్యలో ఎక్కువ సమయం తీసుకున్న తలనొప్పి రావచ్చు. తరచూ తలనొప్పి వచ్చే వాళ్లు ఈ విషయాన్నీ గుర్తుంచుకోవాలి. కొందరికి పిండిపదార్ధాలు, మిట్టాయిలు తిన్నపుడు తలనొప్పి వస్తువుడవచ్చు. ఇలాంటివి గామనించి ఆయా పదార్ధాలకు దూరంగా ఉండడం మంచిది.
- భంగిమ దెబ్బతినడం : సరిగా కూర్చోకపోవడం, నిలబడక పోవడం వల్ల, తలా, మెదడు, దవడలు, భుజాల వెనక కండరాలు ఒత్తిడికి లోనవుతాయి. ఎక్కువసేపు అలాగే ఉండిపోతే నాడుల మీద ఒత్తిడి పెరిగి తలనొప్పికి దారి తెస్తుంది.
- మద్యం అలవాటు : మద్యం తో మూత్రం ఎక్కువగా వస్తుంది. మూత్రం తో పాటు ఉప్పు ఖనిజాలు పోతాయి. అందువల్ల మద్యం ఎక్కువగా తాగితే నీరు ఖనిజ లవణాలు సమతుల్యత అస్తవ్యస్తమై తలనొప్పి రావచ్చు.