Both Men and Women are Good with Pomegranate-In Telugu
దానిమ్మతో స్త్రీ, పురుషులు ఇద్దరికీ మేలు…
దానిమ్మ పండును కోసి చుస్తే లోపల ఎంత అందంగా ఉంటుందో, మన కడుపు లేవుపలికి వెళ్లిన తరువాత అంతటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దానిమ్మ పండువల్ల కలిగే ప్రయోజనాలు అనేకంగా వున్నాయి. ఐతే వాటిల్లో కొన్ని మనం తెలుసుకుందాము.
- దానిమ్మ పండులో అద్భుతమైన రెండు పోషకాలు వున్నాయి. అవి పూనికలాజిన్స్, పునిక్ యాసిడ్. పూనికలాజిన్ అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది ఎన్నోరకాల కాన్సర్ ల నుండి కాపాడుతుంది. ముక్యంగా పురుషుల్లో ప్రోస్టేట్ కాన్సర్, మహిళల్లో రొమ్ము కాన్సర్ లను నివారిస్తుంది. మరొక ప్రధానమైనది పునిక్ యాసిడ్ మనిషికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రధాన ఫ్యాటీ యాసిడ్స్ లో ఒకటి.
- బరువు పెరగకుండా నియంత్రించాలనుకునే వారికీ దానిమ్మ చాలా మేలు చేస్తుంది. దానిలోని పీచు పదార్ధాలు జీర్ణ వ్యవస్థను కాపాడతాయి. ప్రేగుల కదలికళను క్రమబద్దెకరిస్తాయి.
- దానిమ్మ కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది. రక్తనాళాల్లోని పూడికను తొలగిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు గుండె జబ్బులను అధిక తాత్కా పోటును నియంత్రిస్తుంది.
- ఏదైనా గాయాలైనప్పుడు వాటి వాపు, నొప్పి,మంటని తగ్గిస్తుంది.
- చర్మాన్ని మెరిసేలా చేసి, మేని నిగారింపునకు దోహద పడుతుంది. వయసు పెరిగాక వచ్చే ముడతలు,గీతాలను నివారిస్తుంది. వయసు పెరుగుదలని కనిపించకుండా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
- ఎముకలు పటిష్టంగా ఉండడంతో పాటు, కీళ్ల నొప్పులు ఆర్థరైటిస్ వంటి సమస్యలను నివారిస్తుంది.