Bed time Stories for Kids-Telugu Stories

Bed time Stories for Kids-Telugu Stories, Telugu Neethi Kadhalu, Telugu Moral Stories.

 మోసానికి పొతే…
పాపం తలిస్తే ప్రాణం మీదకు వస్తుంది.
రామాపురానికి చెందిన రైతు సుందరయ్య ఒక సరి  వస్తుండగా బోనులో చిక్కుకున్న పులి ఒకటి కనిపించింది. యాడ్ సుందరయ్యని చూడగానే “నన్ను దయచేసి విడిపించండి.” అంటూ దీనంగా వేడుకుంది.  అంతేకాదు బయటకి వస్తే మిమ్మల్ని నేను ఏమి చేయను…నన్ను నన్ను నమ్మండి అంది.  దాంతో సుందరయ్య మనసు కరిగి బోను తలుపు తెరిచాడు. పులి బయటకు రాగానే ” నాకు బాగా ఆకలిగా వుంది…..అంటూ అతని మీదకు వచ్చింది.  సుందరయ్య భయపడి ‘ఇది అన్యాయం! అంటూ అరిచాడు.  అందుకు పులి ‘ఆకలితో వున్ననేను నిన్ను తినడం న్యాయం కాదు అని ఒక్కరితో అయినా చెప్పించు. నిన్ను వదిలేస్తా…! అంది. దాంతో సుందరయ్య చుట్టూ చూసాడు. ఓ చెట్టు కొమ్మ పైన కోతి కనిపించింది.  సుందరయ్య దాని దగ్గరికి వెళ్లి విషయమంతా చెప్పాడు . అంతా విన్న కోతి ‘ఏమిటి మీరు బోనులో ఉండగా పులి కాపాడిందా…? నాకు ఈ మధ్య బాగా చెవుడు వచ్చింది.  కొంచెం గట్టిగ చెప్పండి ! అంది.  ఈ సారి పులి చెప్పింది. దానికి కోతి ‘నాకు నువ్వు ఎంత చెప్పినా వినిపించదు కానీ ఏమి జరిగిందో కాస్త నటించి చూపు !” అంది. దాంతో పులి ‘ఇదితో ఈయన ఇలా నడుస్తూ వస్తుండగా…నేనేమో ఇలా బోనులో వున్నాను…’ అంటూ బోనులోకి వెళ్ళింది. అది ఆలా లోపలి వెళ్ళగానే కోతి  చురుగ్గా కదిలి…బోను గేటును టాప్ మని మూసేసింది. ఏమి జరిగిందో పులి తెలుసుకునే లోపే కోతి  “ఎవరు ఎంత చెప్పిన నువ్వు అతన్ని తింటావని నాకు తెలుసు.  అందుకె ఇలా చేశా.  ప్రాణదాతని చంపాలనుకున్న నీకు ఇదే శాస్తి !” అని చెప్పి వెళ్ళిపోయింది. సుందరయ్య బతుకు జీవుడా అంటూ ఇంటిదారి పట్టదు.    
telugu-moral-stories
telugu-moral-stories
telugu-moral-stories

Leave a Comment

Advertisements
Advertisements