Health Tips in Telugu : Amazing Health Benefits with Badam Almond, Badam Papputo Kalige Arogya prayojanalu.
నాన బెట్టిన బాదం పప్పుటే ఆరోగ్యం
బాదం పప్పు ఆరోగ్యానికి ఏంటో మంచిది. మరీ ముక్యంగా నాన బెట్టిన బాదం పప్పు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. బాదం లో ఇ విటమిన్, ఫైబర్, ఒమెగా 3, ఫ్యాటీ యాసిడ్ తో పాటు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా వుంచుతాయి.
- బాదం పప్పును నీళ్లలో నానబెట్టి తినాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే బాదం పప్పులో వుండే పొట్టులో ఒకరకమైన బయో మాలిక్యులర్ టానిక్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియపై ప్రభావం చూపుతుంది. అదే నానబెట్టి తింటే… జీర్ణక్రియ బాధలనుండి తప్పించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
- గుప్పెడు బాదం పప్పును అరకప్పు నీటిలో షుమారు ఎనిమిది గంటలపాటు నాన బెట్టి…ఆ తరువాత నీటిని తొలగించి పై పొట్టుని తీసివేసి తినాలి. బాదం పప్పును ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు గుండెని పదిలం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
- బాదం పప్పు తినడం వలన రక్తప్రసరణ సాధారణ స్థితిలోనే ఉంటుంది. అంతే కాక శరీరానికి కావాల్సిన శక్తి, విటమిన్లు, మినరల్స్ ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. కొవ్వు శాతం లేకుండా చూసుకోవచ్చు. వీటిని నిరంతరం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పదిలంగా వుంచుకోవచ్చు.