వర్షాకాలంలో జలుబు, గొంతు పొడిబారటం వంటి సమస్యలు చాలా సాధారణం. వీటి బారిన పడకుండా ఉండేందుకు పోషకాహారం తీసుకోవడం ఏంటో ముఖ్యం. ఫిట్ గా ఉంటూ రైనీ డే ను ఎంజాయ్ చేసేందుకు తోడ్పడే ఎటువంటి ఆహరం, పానీయాలు తీసుకోవాలో చేసేస్తున్నారు నిపుణులు.
హెర్బల్ టీ : వర్షం పడుతున్న సాయంత్రం వేడి వేడి హెర్బల్ టీ స్నాక్స్ మంచి కాంబినేషన్. హెర్బల్ టీ శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. ఈ టీ లోని యాన్తి ఆక్సిడెంట్లు ఒంట్లోకి చేరిన హానికర బాక్టీరియాను తొలగిస్తుంది.
డ్రైఫ్రూట్స్ : కాజు, వాల్ నట్, బాదాం, ఖార్జురం, వంటివి ఈ సీజన్లో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచి వ్యాధులకు కారణమయ్యే వైరస్ లను అడ్డుకుంటుంది.
యోగర్ట్ : ప్రోటీన్లు, ప్రోబయాటిక్స్ మెండుగా ఉండే యోగర్ట్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీన్ని స్మూతీల్లో లేదా మజ్జిగగా తీసుకున్నా మంచిదే. రుచికరంగా మాత్రమే కాదు ఆరోగ్యానికి భరోసానిచ్చే ఆహరం ఇది.
సుగంధ ద్రవ్యాలు : పసుపు, నల్ల మిరియాలు, అల్లం, దాల్చిన చెక్కను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇవి భోజనం త్వరగా జీర్ణమయ్యే దానికి తోడ్పడతాయి. వీటితోపాటు తాజా కూరగాయలు పండ్లు తినడం వలన వర్షాకాలంలో ఆరోగ్యంగా వుంటారు.
విటమిన్ సి : విటమిన్ సి అధిక మోతాదులో తీసుకోవడం వలన వర్షాకాలంలో జలుబు వంటి సాధారణ ‘సమస్యలు నుండి దూరం చేస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెంచుతుంది.
- వర్షాకాలంలో నీరు కలుషితం అవుతుంది. నీటిని వేడి చేసుకుని తాగడం మంచిది.
- బ్రౌన్ రైస్ మరియు ఓట్స్ వంటి తేలికపాటి మరియు వెచ్చని ఆహారాన్ని మితంగా తీసుకోవాలి.
- తగినంత నిద్రపోవడంవలన శారీరకంగా, మానసికంగా మంచిది.
- రోడ్ సైడ్ న వున్నా తినుబండారాలను తినక పోవడం మంచిది.
- చల్లని పానీయాలు మరియు రిఫ్రిజరేటెడ్ వస్తువులను ఒకేసారి తినకూడదు. ఇవి శ్వాసకోశ వ్యాధులను ప్రేరేపిస్తాయి.