5 Fruits That You May Include In Your Diabetes Diet-Telugu
Chali Kalamlo Sugar Patients Tine Pandlu
చలికాలంలో షుగర్ పేషెంట్స్ తినే 5 రకాల పండ్లు.
చలికాలం రాగానే షుగర్ పేషెంట్స్ కి షుగర్ లెవెల్స్ పెరిగి పోతుంటాయి. అలా కాకుండా ఈ సమయంలో కొన్ని పండ్లు తీసుకోవాలి అవేంటో ఇప్పుడు చూద్దాం.
షుగర్ వ్యాధి వచ్చిందనంటే చాలు దీనిచుట్టు ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టూ ముడుతాయి. మిగతా సమయాలకంటే శీతాకాలంలో ఈ వ్యాధి గ్రస్థులు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమయంలో డయాబెటిక్ పేషెంట్ కి నరకంలా ఉంటుంది. ఈ సమస్యనుని కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని పండ్లను తీసుకోవచ్చు.
1. జామకాయ : జామకాయలో విటమిన్ ఏ మరియు విటమిన్ సి ఉండడం వలన చెక్కర స్థాయిలు తగ్గిస్తాయి. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలోని కొవ్వుని గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. తక్కువ ధరలో లభించే వీటిని డయాబెటిస్ వున్నవారు హాపీగా తినవచ్చు.
2. ఆపిల్స్ : మధుమేహ గ్రస్తులు ఏ సమయంలోనైనా ఈ పండు తినడం వలన మలబద్దకం దూరం అవుతుంది. టైప్ 2 డయాబెటిస్ ని నిరోధించగల శక్తి కూడా ఈ ఆపిల్స్ కి ఉంది. ఇందులో డైల్యూటెడ్ ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వలన మధుమేహం నియంత్రణలో ఉంటుంది. శరీరంలోని విషతుల్య రసాయనాలను తొలగించడంలో ఆపిల్స్ బాగా పనిచేస్తాయి.
3. గ్రేప్స్ : గ్రేప్స్ లో 91% నీరు ఉంటుంది. అదే విధంగా …ఇందులో విటమిన్ సి నిల్వలు కూడా అధికంగా ఉంటాయి. గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా 25 గ్రాములు ఉంటుంది. దీనిలో డైల్యూటెడ్ ఫైబర్ నిల్వలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి షుగర్ పేషెంట్ కి చాలా మంచిది. వీటిని తినడంవల్ల వచ్చేమార్పులు మీరు గమనించవచ్చు. ఇవి రక్తంలో చెక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
4. నారింజ పండు : పీచు పదార్ధం అధికంగా వుండి….చెక్కర తక్కువగా ఉండే నారింజ పండ్లని షుగర్ పేషెంట్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. విటమిన్ సి, థాయమిన్స్ …రక్తం లోని చెక్కర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. అంతే కాదు….ఇందులో ఎక్కువగా నీటి శాతం ఉంటాయి. గ్లైసిక్ ఇండెక్స్ తక్కువగా కలిగి ఉంటాయి. వీటిని రేగులర్ గ తినడం వలన బరువు నియంత్రణలో ఉంటుంది.
5. ఫైనాఫిల్ : ఈ పండ్లలో యాంటీ వైరల్, యాంటీ ఇంఫమటరీ గుణాలు అధికంగా ఉంటాయి. సుగరుతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.