4 Ways to get Beautiful Eyes- Beauty Tips in Telugu
Amazing Beauty Tips and Tricks in Telugu
అందమైన శరీరానికి, వ్యాయామం ఎంత అవసరమో, కంటి చూపు మెరుగ్గా ఉండటానికి కళ్ళకి వ్యాయామం అంతే అవసరం. అలాంటి ముఖ్యమైన వ్యాయామాలేమిటనేది చుద్దాం.
కళ్ళు ఆర్పడం : ఏకాగ్రతతో పని చేసే సమయంలో కళ్ళు ఆర్పడం మర్చిపోతూ ఉంటాం. దీనివల్ల కళ్ళు పొడిబారి మంటలు మొదలవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కంప్యూటర్ ముందుకుర్చిని పని చేసే సమయంలో, ఎక్కువ సమయం పాటు టీవీ చూసే సమయంలో కళ్ళు ఆర్పడం పై కూడా దృష్టిపెట్టాలి. ఇలా చేయడం వాళ్ళ కాళ్ళమీద ఒత్తిడి తగ్గి తొందరగా అలసి పోకుండా ఉంటాయి.
ఫోకస్ : బొటనవేలును ముఖానికి రెండు అంగుళాల దూరంలో ఉంచి, ఏ వేలి మీద ద్రుష్టి కేంద్రీకరించాలి. తరువాత ఆ వేలును వీలైనంత దూరం తీసుకెళ్లాలి. ఇలా చేస్తున్నపుడు ద్రుష్టి మరల్చకూడదు. అలాగే దగ్గరలో ఉన్న ఓ వస్తువు మీదకు ద్రుష్టి సారించి వెంటనే దూరంగా ఉన్న మరో వస్తువు దీదాకు ద్రుష్టి మళ్లించాలి. ఇలా మార్చి మార్చి చేయాలి .

కంటికి యోగా : కళ్లచుట్టూ ఉండే కండరాలకు వ్యాయామాన్ని అందించడం ద్వారా కళ్ళను ఆరోగ్యంగా ఉంచవచ్చు. ఇందుకోసం కళ్ళను వీలయినంత పైకి తిప్పి తిరిగి చుబుకం వైపుకు కిందికి తిప్పాలి. ఆ తరువాత కనుగుడ్లను ఎనిమిది అంకె ఆకారంలో తిప్పాలి.
విశ్రాంతి : అలసిన కళ్ళకి విశ్రాంతిని ఇవ్వడంకోసం రెండు అరచేతులతో కళ్ళను మూసేయాలి. ఇలా చేస్తే ఆ కొద్ది సేపటి వరకు కళ్ళలోకి వెలుగు చొరబడకుండా ఉండి కళ్ళు స్వాంతన పొందుతాయి.