Health Benefits-5 Amazing Health Benefits of Yogurt-Telugu.
పెరుగు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పెరుగు కొన్ని వందల సంవత్సరాలనుండి మానవులు వినియోగిస్తున్నారు. ఇది చాల పోషక విలువలు కలిగినది. దీనిని క్రమం తప్పకుండ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి.
ఉదాహరణకు గుండె జబ్బులు మరియు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది అంతే గాకుండా బరువు పెరుగుదల నియంత్రణలో సహాయపడుతుంది.
పెరుగు ఎలా తయారవుతుంది? పెరుగు ఒక ప్రసిద్ధ పాల ఉత్పత్తి, ఇది పాలు యొక్క బాక్టీరియా కిణ్వ ప్రక్రియ ద్వారా తయారవుతుంది.
కడుపు నొప్పులనుండి ఉపశమనం లభిస్తుంది.
రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.
అధిక రక్తపోటు తగ్గుతుంది.
ఎముకలు దృఢంగా మారుతాయి.
వ్యాయామం తో కోల్పయిన శక్తిని వెంటనే పొందవచ్చు.
వివిధ రకాల అలర్జీలు తగ్గుతాయి.
చిగుళ్లపై హానికార క్రీములు చేరకుండా చేస్తుంది.
బరువు నియంత్రణలో ఉంటుంది.
చర్మ వ్యాధులు వున్నవారికి కూడా పెరుగు, మజ్జిగ ఉపయోగం అమోఘం. సోరియాసిస్, ఎగ్జిమా ఉన్న వారికీ పెరుగు కానీ మజ్జిగ కానీ పై పూతగా వాడితే మంచి ఫలితం వుంటుంది.
పలుచని పెరుగులో ముంచిన బ్యాండేజి క్లాత్ చర్మ వ్యాధి ఉన్న ప్రాంతం పై కొద్దీ సేపు ఉంచితే తొందరలోనే ఆ ప్రాంతం ఆరోగ్యవంతమైన చర్మం గ రూపొందుతుంది.
కామెర్లు వచ్చిన వారికీ పెరుగు ఒక చక్కని ఔషధం. ఎందుకంటే హైపటైటిస్ వచ్చిన వారికి, రక్తములో అమోనియా శాతం పెరిజగి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఐతే పెరుగు వాడడం వలన దాని బారిన పడకుండా ఉండవచ్చు.
పెరుగులో వుండే లాస్టిక్ యాసిడ్ అమ్మోనియా నుంచి వచ్చే చెడు లక్షణాలను నిరోధిస్తుంది.